Abhi9 News - తెలంగాణ / వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదుల రిజర్వాయర్ పనులను వనపర్తి వాకింగ్ బృందం ఈరోజు సందర్శించారు వనపర్తి మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్ వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ బాదం పాండు చల్ల రాజశేఖర్ రామేశ్వర్ రెడ్డి నూకల సురేష్ విజయ్ రాము సంభు రవి నూకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ను అత్యంత స్వల్ప కాలంలో భూసేకరణ సేకరించి నిర్మాణం పూర్తి కావచ్చిందని ఇది నిరంజన్ రెడ్డి యొక్క పట్టుదలకు నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పాలమూరు నల్లగొండ రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించే గొప్ప ప్రాజెక్టు అని ఇదే కాకుండా వెనకబడ్డ పాలమూరు ప్రాంతానికి తాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందించే అవకాశం ఉందని చెప్పారు ఈ ప్రాజెక్టుకు సహకరించిన ఏదుల కుంకలపల్లి మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కృషి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ గారికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు
Admin
Abhi9 News