Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మున్సిపాలిటీ కార్మికులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించి అనంతరం మహిళల ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. మున్సిపల్ చైర్మెన్ ,మార్కెట్ చైర్మన్ కాన్సిలర్స్ ,నాయకులు ,అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో సాధించిన తెలంగాణలో అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, తొమ్మిదేళ్లలో అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం పట్టణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పట్టణాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని జైపాల్ యాదవ్ అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే పట్టణాలల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగు కాల్వలను శుభ్రం చేయించి, హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
Admin
Abhi9 News