Saturday, 18 April 2026 03:33:30 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

Date : 02 March 2026 10:20 PM Views : 86

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రజావాణిలో దరఖాస్తులు 148 స్వీకరణ ప్రజావాణి కార్యక్రమం లో ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరం పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరిస్తూ వారు చెప్పిన సమస్యలు సావధానంగా విని సమస్యల పరిష్కారం కు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండల తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఓ లతో సంబంధిత మండల సమస్యలు ఫిర్యాదులు స్వీకరించి వారితో ఆన్లైన్ లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.తహశీల్దార్,ఎం.పి.డి.ఓ,ఎం.పి.ఓ సోమవారం మండల ప్రజావాణి కార్యక్రమం కు హాజరై ప్రజల సమస్యలు పరిష్కారం కు చొరవ చూపాలని సూచించారు. మిడ్జిల్ మండల తహశీల్దార్ ,ఎం.పి.డి.ఓ లతో మాట్లాడి పాఠశాల ఆక్రమణ,పెన్షన్ సంబంధించిన సమస్యలు పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వి వయో వృద్ధులు తమ కుమారుడు నిరాదరణ కు గురైన వారు ఫిర్యాదులపై ఆర్.డి.ఓ కు ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ సర్వే,రెవిన్యూ,గృహ నిర్మాణం,వృద్ధాప్య పెన్షన్ లు,మున్సిపాలిటీ,పంచాయతీ,ఇతర శాఖల సంబంధించిన వివిధ సమస్యలపై 148అంది ప్రజావాణి లో కలెక్టర్ కు ఫిర్యాదులు అంద చేశారు. ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ సి.ఎం.ప్రజావాణి,ప్రజావాణి లో వచ్చిన పెండింగ్ లో నున్న ఫిర్యాదులు వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు జిల్లా అధికారులు తమకు కేటాయించిన గురుకులాలు, హాస్టల్ లు పిబ్రవరి మాసం కు సంబంధించి తనిఖీ లు పూర్తి చేయాలని ఆయా అధికారులకు సూచించారు.సమావేశంలో జడ్.పి.సి.ఈ.ఓ వెంకట రెడ్డి, డి ఆర్.డి.ఓ నర్సింహులు,ఆర్.డి.ఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు నూతన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన ఎస్.పి.,రెవెన్యూ అధనపు కలెక్టర్,అధికారులు నూతన కలెక్టర్ ఖుష్బూ గుప్తా ను కలెక్టర్ కార్యాలయం లో ఎస్.పి. డి.జానకి,రెవెన్యూ అధనపు కలెక్టర్ హరిప్రియ,ఆర్.డి.ఓ నవీన్,జడ్.పి.సి.ఈ.ఓ వెంకట రెడ్డి,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని సునీత,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె. కృష్ణ,జిల్లా సాధారణ ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగా అజ్మీరా,బి.సి.సంక్షేమ శాఖ అధికారిని ఇందిర,మత్స్య శాఖ అధికారిని రాధా రోహిణి,ఎల్.డి.ఎం. చంద్ర శేఖర్, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది తదితరులు కలిసి మొక్క,పుష్పగుచ్చం లు అంద చేసి శుభాకాంక్షలు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :