Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన ఆదేశాల మేరకు జిల్లా లో ఈరోజు ఆపరేషన్ ముస్కాన్- IX బృందం దాడులు నిర్వహించి ఇద్దరు బాలకార్మికులను పట్టుకోవడం జరిగింది. వీరు మల్డకల్ మండలము లోని ఒక గ్రామము లో చికెన్ షాప్ లో ఒకరు, మరొకరు అదే గ్రామ శివారు లో ఒకరి దగ్గర గొర్రెలు కాస్తుండగ ఆపరేషన్ ముస్కాన్-IX బృందం ప్రత్యేక నిఘా ఉంచి బాల కార్మికులు గా గుర్తించి అనంతరం దాడులు నిర్వహించి పట్టుకొని CWC ఆఫీస్ లో అప్పగించడం జరిగింది . తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బల కార్మికులను పనిలో పెట్టుకున్న వారికి జరిమానా విధించడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. బాల్యం ఎంతో విలువైనది ఈ వయసులో పిల్లలని చదువుకోనివ్వాలని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మెరుగైన విద్య అందిస్తున్నారని ప్రజలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని బడిలో చేర్పించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్100 కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వగలరని జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన సూచించారు.
Admin
Abhi9 News