Saturday, 18 April 2026 05:14:41 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి.

Date : 05 November 2025 01:32 PM Views : 165

Abhi9 News - తెలంగాణ / సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అందులోని కంకర బస్సులో పడి దాదాపు 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి 65 సమీపంలో పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ముందు ఉన్న కారును తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అవడంతో బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరూ కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు మేడ్చల్ డిపోకు చెందింది. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పటాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆర్టీసీ బస్సులకు వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :