Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉట్కూరు పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల అధ్యక్షులు ఎం భాస్కర్ బహుమతులను అందజేయడం జరిగింది. గెలిచిన విద్యార్థులు ఇకముందు జరిగే పోటీలకు కూడా గెలుపొందాలని ఓడిన విద్యార్థులు బాధ పడకుండా మున్ముందు వచ్చే పోటీలలో విజయం సాధించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటాయని విద్యార్థులందరూ చక్కని సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు విశాల్, ఆచార్యులు రోషన్ అప్ప, దేవి, కిషోర్, నరసింహా , భారతి జ్యోతి , రాధ , ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Admin
Abhi9 News