Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. సియర్ సూన్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్న పెట్ లో ఓ ఇ ల్లు కూలిపోయింది. అయతే ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.ఇప్పటికే అది కారులు ఆదేశాలు జరి చేశారు.వర్షం పడుతున్న కారణంగా జాగ్రతగా ఉండాలని సూచించారు.
Admin
Abhi9 News