Saturday, 18 April 2026 03:30:57 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్!

Date : 09 February 2026 12:51 PM Views : 116

Abhi9 News - తెలంగాణ / Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి పోలింగ్ తేదీ అనగా ఫిబ్రవరి 11 సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రంలోని ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వైన్‌షాపులు, బార్లు మూతపడనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ఫలితాల రోజు అనగా ఫిబ్రవరి 13న కూడా మద్యం షాపులు, బార్లు మూతబడనున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సోమవారం సాయంత్రంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఈ ఆంక్షలను అమల్లోకి తీసుకురానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయించినా, షాపులు ఓపెన్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా దుకాణాలు లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఆంక్షలు కేవలం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఉంటుందని అధికారులు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :