Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణలో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొన్నటి దాకా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయగా.. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య కళాశాలలు.. వాటి యాజమాన్యాలపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్‌లోని ప్రతిమ గ్రూప్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఈడీ తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ వైద్య కళాశాలలు, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలల్లో తనిఖీలు ప్రతిమ కళాశాలతో పాటు ప్రతిమ మల్టీప్లెక్స్‌లో తనిఖీలు నిర్వహించారు. అలాగే కళాశాల యాజమాన్యం ఆఫీసు, ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్, ఎల్బీనగర్‌లోని కామినేని వైద్య కళాశాల, ఇంకా ఇతర కళాశాలల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో అక్రమాలపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు.. గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారని కేసును పోలీసులు నమోదు చేశారు. నమోదు వరంగల్ పోలీసులు కేసు ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తును ఈడీ చేస్తుంది. పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి.. ఆ తర్వాత వాటిని అమ్ముకున్నారని అభియోగం మోపారు. తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి...
Admin
Abhi9 News