Saturday, 13 June 2026 04:59:01 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వైభవంగా జ్ఞానసరస్వతి దేవాలయ గోశాలలో సామూహిక గోపద్మ వ్రతాలు

Date : 07 July 2023 04:57 PM Views : 204

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : గోవులను పూజిస్తే సమస్త దేవతలను పూజించిన వ్రత ఫలితం అందుతుందని, ఆషాడ మాసంలో చాతుర్మాస గోపద్మ వ్రతం సుమంగళీ స్త్రీలు చేయడంతో అష్టైశ్వర్యాలు, గ్రహదోష పీడ నివారణలు ఏకకాలంలో చేసుకోవచ్చని వేద పండితులు తిరునగరి పవనాచార్యులు అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్ర సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలోనీ గోశాలలో ఆషాడ మాస శుక్ల పంచమి రోజు సామూహికంగా గోపద్మవ వ్రతాన్ని వేద బ్రాహ్మణుల బృందంచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 168 మంది మహిళలు సామూహిక గోపద్మ వ్రతంలో పాల్గొని వ్రతాలు నిర్వహించారు. మహాభారత కాలంలో ద్రౌపది దేవి అప మృత్యుదోషం నివారణకు గోపద్మ వ్రతం ఆచరించిందని అన్నారు. గో వ్రత కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ పుణ్యావాచనం రక్షాబంధనం, ద్వాదశ ఆదిత్యులు, ఆదిత్య వాసువులు, ఏకాదశరుద్రులు, లక్ష్మీ, దుర్గ, పార్వతి, సరస్వతి దేవతల ఆహ్వానది షోడాషా ఉపచర పూజలు, వేదమంత్రో చరణాల మధ్య అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. లలిత సహస్ర పారాయణ కమిటీ మహిళా సభ్యులచే సామూహిక లలిత సహస్ర నామ పారాయణంను పఠించారు. ఈ వ్రతం ఆచరించడంతో గ్రహదోష నివారణ, యశస్సు కీర్తి లబ్ధి, వాస్తు దోష నివారణ, అష్టైశ్వర్యాలు కలిగి ఆర్థిక వ్యాపార అభివృద్ధి విశేష పుణ్యఫలితం ఉంటుందన్నారు. అనంతరం ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు సామూహికంగా ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సరస్వతి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమేఈశ్వరయ్య, మహిళా కార్యదర్శి దొడ్ల ఇందుమతి ఈశ్వర్ రెడ్డి, గోశాల అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు లగిశెట్టి వరలక్ష్మి,రవికుమార్, బాలస్వామి, భూపాల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెంటమ్మరాజు నవీన్ కుమార్ శర్మ, రంగాచార్యులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :