Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ఆషాడ మాసంలో శుద్ధ త్రయోదశి శనివారం రోజు రావడంతో శని త్రయోదశి ప్రత్యేక వేడుకలు, పూజలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారని శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ శనీశ్వర స్వామిని కృపా కటాక్షాలు పొందుటకు గ్రహ శాంతి నివారణకు భక్తులు స్వామివారిని శనివారం రోజు ప్రత్యేకంగా పూజించాలన్నారు శనివారము అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిత్తులు ఉన్న రోజు స్వామివారిని కొలిస్తే రెట్టింపు విశేష ఫలితం భక్తులకు అందుతుందని తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుండి పాల్గొని విశేషంగా పూజలు చేశారని ఆయన తెలిపారు. స్వామివారికి అష్టోత్తర నామావాలితో వీరశైవ లింగాయత్ ఆగమ ప్రకారం ప్రత్యేకంగా వేదమంత్రచరణల మధ్య శనేశ్వర స్వామికి పూజలు చేశారన్నారు. బ్రహ్మ సూత్రం గల పరమశివునికి భక్తులు రుద్రాభిషేకం, అర్చనలు,దైవ దర్శనం, దర్శించుకుని స్వామివారిని కొలిచరణని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, ఆలయ కమిటీ వారిచే భక్తులకు నీటి వసతి, అల్పాహార భోజనవసతి సదుపాయాన్ని కల్పించారు. స్వామివారికి ప్రాతః కాలం నుండి ప్రదోషకాలం వరకు విడుతల వారీగా అభిషేకాలు భక్తులు చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాలరావు సర్పంచ్ వంగ సుదర్శన్ గౌడ్ కమిటీ సభ్యులు వీరశేఖర్,శేకరాచారి, అర్చకులు గవ్వ మఠం శాంతి కుమార్, అర్చక బృందం, భక్తులు మహిళలు ,వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Abhi9 News