Saturday, 13 June 2026 04:59:48 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పాలాభిషేకం చేసిన స్థానికులు

అభివృద్ధి ప్రదాతపై తమ అభిమానాన్ని చాటుకున్న మహబూబ్ నగర్ వాసులు

Date : 12 June 2023 11:41 AM Views : 586

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బి కే రెడ్డి కాలనీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బుక్క రవి సహా స్థానికులు మంత్రిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రిపై పూల జల్లు కురిపించి... పాలాభిషేకం చేశారు. పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద పార్టీ చేరికల అనంతరం మంత్రి వారించిన వినకుండా నాయకులు కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అభిమానులు కార్యకర్తలు జై శ్రీనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ట్యాంక్ బండ్ నుంచి నేరుగా వార్డు పర్యటనకు బయలుదేరారు. బికే రెడ్డి కాలనీలో వీధులన్నీ కలియతిరిగారు. ఇంటింటికి వెళ్లి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, సిబ్బందికి చేపట్టాల్సిన పనుల వివరాలను మంత్రి తెలియచేశారు. మంత్రి వెంట మునిసిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :