Abhi9 News - క్రైమ్ వార్తలు / నాగర్ కర్నూల్ : ఊర్కొండ మండల తిమ్మనపల్లి గేటు వద్ద తెల్లవారుజామున విషాదం నెలకొంది. శ్రీశైలం వెళ్తున్న కర్ణాటక భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Abhi9 News