Saturday, 13 June 2026 04:57:40 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మిస్టర్ ఇండియాకు అండగా నిలుస్తాం... - మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

Date : 06 October 2023 12:10 PM Views : 327

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మిస్టర్ ఇండియాగా గెలిచి వచ్చే నెలలో జరిగే మిస్టర్ గ్లోబల్ టైటిల్ కోసం పోటీపడుతున్న హైదరాబాద్ కు చెందిన యువకుడు జాసన్ డైలాన్ బ్రెట్ఫీలియాన్ కు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవలే గోవాలో జరిగిన రుబారు మిస్టర్ ఇండియా- 2023 టైటిల్ పోటీలో విజయం సాధించిన నేపథ్యంలో జాసన్ తన తల్లితండ్రులు రూప్ చందన, వాలెంటీన్ బ్రెట్ఫీలియాన్ లతో కలిసి మహబూబ్ నగర్ లో మంత్రిని కలిశారు. దేశవ్యాప్తంగా అనేక మంది పోటీ పడినా ఫైనల్ పోరులో గెలిచి తెలంగాణ పేరు నిలబెట్టి మిస్టర్ ఇండియాగా నిలిచినందుకు జాసన్ ను మంత్రి అభినందించారు. థాయిలాండ్ లో జరుగనున్న మిస్టర్ గ్లోబల్ టైటిల్ పోరు కోసం వెళ్లేందుకు ఆర్థికంగా చేయూతను అందిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల్లో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తేస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, విలువైన ప్రదేశాలలో ఇంటి స్థలాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. జాసన్ మిస్టర్ వరల్డ్ పోటీల్లోనూ టైటిల్ కైవాసం చేసుకుని రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా జాసన్ ను మంత్రి సన్మానించారు. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అందిస్తున్న సహకారానికి మిస్టర్ ఇండియా జాసన్ కృతజ్ఞతలు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :