Abhi9 News - తెలంగాణ / Hyderabad : జిల్లా కలెక్టర్ కార్యాలయం - ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యే ఐడిఓసి ప్రాంగణంలో మంత్రికి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంత్రివర్యులు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను మంత్రితో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి.మధుసూదన్ రెడ్డి , జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుధ్ రెడ్డి , ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, శాంతన్న యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, జేసిఆర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
జోగులాంబ జోన్ - VII డిఐజీ కార్యాలయం మరియు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం
జోగులాంబ జోన్ - VII డిఐజీ కార్యాలయం మరియు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా డిఐజీ శ్రీ ఎల్. ఎస్. చౌహన్, ఐపిఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపిఎస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిఐజీ ఎల్. ఎస్. చౌహన్ ప్రజా పాలన యొక్క ప్రాముఖ్యత, పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు అందే లాభాలను వివరించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎన్ బి రత్నం, ఎ అర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డిసిఆర్ బి డిఎస్పి రమణా రెడ్డి, ఎ అర్ డిఎస్పి శ్రీనివాసులు, ఎవో రుక్మిణి భాయి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్‌ఉద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎఫ్‌పిబి ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అర్ ఐ లు కృష్ణయ్య, నగేష్ మరియు అనేక మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Abhi9 News