Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో గృహ కార్మికుల ఆధ్వర్యంలో గృహ కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడ్వకేట్ జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహ కార్మికులు కాలంతో పోటీ పడుతూ.. ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్నరని, అలాంటి ఉద్యోగులకు ఇంటి పనులు చేసుకోవడం కొంచెం కష్టమే కనుక అలాంటివారికి హోం మెయిడ్ తప్పనిసరి అని అన్నారు. మహిళలలో మార్పులు వస్తే ప్రపంచాన్ని ఏలవచ్చు అన్నారు. ప్రతి ఇంటిలో మహిళా ఓపిక సహనం ఉండాలని మన పిల్లలలో క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటే ఇంటి యజమానురాలు సరిగ్గా ఉంటే ఇంటిలో ఎలాంటి గొడవలు కాకుండా ఉంటాయని తెలిపారు. అయితే తమకు డిమాండ్ ఉన్నా జీతం మాత్రం 7 వేలు లోపే ఉంటుందని వాపోతున్నారు. నెలకు రూ.10 వేలు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Admin
Abhi9 News