Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ, మంచి నడవడిక అలవడితే జీవితంలో క్రమశిక్షణతో పాటు ,మంచి మూర్తి మత్వం కలిగిన పౌరులు తయారవుతారని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన కార్యవర్గ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, వ్యక్తిగత మూర్తిమత్వాన్ని పెంపొందించుకునేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. అందువల్ల ప్రతి పాఠశాలలో స్కౌంట్స్అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. స్కౌట్స్, గైడ్స్ భవన అభివృద్ధికి తన వంతుసహాయ సహకారాలు అందిస్థానన్నారు.స్కౌట్స్ గైడ్స్ పై శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ శిబిరాల ఏర్పాటుకు లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంతేగాక స్కాట్స్ అండ్ గైడ్స్ భవనంప్రధాన రహదారి వైపు ప్రహరీ నిర్మాణానికి నిధుల మంజురుకు సహకారం అందిస్తామని తెలిపారు . కాగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, సెక్రటరీగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ,ఉపాధ్యక్షులుగా మల్లారెడ్డి, బెక్కరి రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ,వీణ శివకుమార్, ట్రెజరర్ గా ధనుంజయ రెడ్డి ,ట్రైనింగ్ కమిషనర్ గా జె. హనుమంతు ,విజయలక్ష్మి, జాయింట్ సెక్రెటరీగా స్వరూప రాణిలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ ఎం రాజా గోపాల్,చీఫ్ కమిషనర్ ఎస్.మల్లారెడ్డి ,ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు నటరాజ్, స్కౌట్స్ గైడ్స్ ఉపాధ్యక్షులు అల్లా రెడ్డి,బెక్కరి రామిరెడ్డి ,స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ ,ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన పరమేశ్వర్ తదితరులు హాజరయ్యారు.
Admin
Abhi9 News