Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా ఎస్.పి శ్రీమతి రక్షిత కె మూర్తి, ఐపీఎస్ ఆదేశానుసారం వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో ఇందిరా నగర్ కాలనీ లో వనపర్తి DSP శ్రీ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి సీఐ మహేశ్వర్ , ఎస్సైలు -08 మంది ASI/HCs 11 మరియు 39 PCs మొత్తం 60 మంది పోలీసులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించినారు.అదేవిదంగా కాలనీవాసుల కు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, CEIR దొంగతనం ఫోన్ల రికవరీ మొదలైన వాటి గురించి అవగాహన నిర్వహించారు. నంబర్ ప్లేట్ సరిగా లేని ద్విచక్ర వానాలు ,పత్రాలు సరిగాలేని, 39 ద్విచక్ర వాహనాలు,02 ఆటోలు అదుపులోకి తీసుకొని వనపర్తి టౌన్ పోలీస్టేషన్ కు తీసుకువెళ్లారు. సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని తెలిపారు. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, కల్పించడం గురించి,ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అన్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, SW భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని డి ఎస్పీ తెలిపారు.
Admin
Abhi9 News