Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన ఓ బాలికనువఅత్యాచారం చేసిన దోషికి ఫోక్సో కోర్టు జడ్జి శ్రీమతి సునీత బుధవారం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష ,రెండు వేల రూపాయల జరిమాలను విధించారు.బాలికలు, మహిళల పట్ల జరిగే నేరాలపై న్యాయస్థానం సీరియస్ గా వ్యవహరించింది. వనపర్తి ఫోక్కోర్టులో ఇది మొదటి తీర్పు అని వనపర్తి అదనపు జిల్లా కోర్టు పీపీ చంద్రశేఖర్ రావు తెలిపారు. జిల్లా ఫోక్సో కోర్టు లో ఇది మొదటి తీర్పు కావడంతో మహిళా సంఘాలు తీర్పును హర్షిస్తున్నాయి. బాలికలు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు శిక్ష లు కఠినంగా ఉంటాయని జడ్జి శ్రీమతి సునిత ఈ సందర్భంగా హెచ్చరించారు....
Admin
Abhi9 News