Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల వైద్య అధికారి డాక్టర్ సుస్మిత మీడియా తో మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది కావున మండలంలోని ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు... దోమల వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాని, వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని, రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్థాలను తినకూడదన్నారు.దగ్గు, జలుబు, జ్వరం ఏమైనా ఉంటే మీ గ్రామంలోని అందుబాటులో ఉన్న ఆశ కార్యకర్తలను లేదా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలను కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు....
Admin
Abhi9 News