Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు రెవెన్యూ ఫైళ్లు అగ్నికి ఆహూతైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు భయాందోళనలతో కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
Abhi9 News