Saturday, 18 April 2026 06:44:45 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు

యూట్యూబర్లకు సజ్జనార్ వార్నింగ్

Date : 16 October 2025 05:17 PM Views : 226

Abhi9 News - తెలంగాణ / Hyderabad : యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. లైక్స్, వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. వ్యూస్‌, లైక్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ఫేమస్‌ అయ్యేందుకు చిన్నారుల భవితను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లతో కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా వీసీ సజ్జనార్‌ పోస్ట్‌ పెట్టారు. "చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ను చేస్తూ, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? చిన్నారులు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహదపడండి. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించే పనులు చేయొద్దు. గుర్తు పెట్టుకోండి. ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాదు, చట్టరీత్యా నేరం కూడా."- ఎక్స్లో సీపీ సజ్జనార్ చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ను చేయడం లాంటి చర్యలు పోక్సో, జువైనల్‌ జస్టిస్‌ చట్టాలను ఉల్లంఘించడమేనని సీపీ సజ్జనార్ ఎక్స్లో పేర్కొన్నారు. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం, వారిని వేధించడం కిందికే వస్తుందని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : మైనర్లతో ఈ తరహా కంటెంట్ను చేసే వారి పట్ల పోలీస్‌ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని సీపీ సజ్జనార్ 'ఎక్స్'లో తెలిపారు. అలాంటి వాటికి సంబంధించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. తక్షణమే వీటిని తొలగించకున్నా, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసినా చట్టప్రకారం కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వీడియోలపై వెంటనే రిపోర్ట్ చేయండి : సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే రిపోర్టు చేయాలని యూజర్లను కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి గానీ, నేషనల్ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ (cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారి బాల్యం, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం కూడా మీ బాధ్యతే అనే విషయం మరిచిపోవద్దని సజ్జనార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది ఎక్కువ వ్యూస్, లైక్స్ రావడం కోసం మైనర్లతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అలాంటి వాటివల్ల మైనర్లపై చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ యూట్యూబ్ ఛానళ్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అనుచిత వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడమని ఆయన హెచ్చరించారు. ఇటీవలే స్పష్టంగా చెప్పిన సీపీ సజ్జనార్ : హైదరాబాద్‌ నూతన కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తాజాగా యూట్యూబ్ ఛానళ్లకు సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. మరోవైపు బెట్టింగ్ భూతంపై కూడా సజ్జనార్ పోరాడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల వచ్చే అనర్థాలపై ఇప్పటికే ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :