Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మాయమాటలతో, తప్పుడు వాగ్దానాలతో తమను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మోసం చేశారని... ఆ పార్టీ నాయకులు, వారి పార్టీ తీరును అర్థం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని హన్వాడ మండలం కిష్టంపల్లి గేట్ తండా వాసులు తెలిపారు. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో వార్డు సభ్యులు కే రవీందర్, బోయిని అంజి సహా కే వెంకటయ్య, కే గోపాల్, మేఘ్య నాయక్, లక్ష్మణ్ నాయక్, బుడ్డ నాయక్ తో పాటు సుమారు 30మంది మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పొరపాటు చేశామని... సొంతగూటికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించేందుకు తామంతా కష్టపడి పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ నగేష్, మాజీ సర్పంచు సరోజా గోపాల్ ఉన్నారు.
Admin
Abhi9 News