Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో తన క్యాంపు కార్యాలయంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు.. ఈ సందర్భంగా శాంతినగర్ లో సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు..జిల్లాలో ఉన్న ప్రతిపక్షాల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడం ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ నుండి సమస్యల పై వినతి ఇవ్వడానికి అడిగితే స్పందించడం లేదని మితిమీరిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు సీఎం కేసీఆర్ మీటింగ్ కు బస్ లు పెడ్తున్నామని సెలవు ఇచ్చారనీ అయన అన్నారు.విద్యార్థి సంఘాల నాయకులను, గ్రామాల బాధిత రైతులులను సీఎంకు సమస్యలు విన్నవిద్దామని చెప్పిన వారిని ముందస్తు అరెస్ట్ చేస్తున్నార ని మండిపడ్డారు.బేశరత్తుగా క్షమాపణలు చెప్పి గృహనిర్బంధం మరియు అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు..లేనిపక్షంలో సాయంత్రంలోపు మరో ఉద్యమానికి శ్రీకారం చేపడతామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఇటిక్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రుక్మనంద రెడ్డి కిసాన్ అధ్యక్షుడు ఏనుగుల నాగరాజు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగ శిరోమణి వడ్డేపల్లి టౌన్ అధ్యక్షుడు చిన్ని బాబు వడ్డేపల్లి దేవేంద్ర యూత్ యూత్ అధ్యక్షుడు కృష్ణ కాంత్ పచ్చర్ల కుమార్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు...
Admin
Abhi9 News