Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : విద్యార్థులు క్రమశిక్షణ ,పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు.భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి స్వామీ మునీశ్వరా నంద జీ ఆధ్వర్యంలో మంగళ వారం మహబూబ్ నగర్ లోని కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న బాలికల ప్రభుత్వ వసతి గృహం, మాడల్ బేసిక్, బాలికల ఉన్నత పాఠశాల, బి పి హెచ్ ఎస్, రాంనగర్, సరస్వతి శిశు మందిర్, ధర్మ పూర్, పోలీస్ లైన్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , డిఇఓ రవీందర్, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు చక్కగా చదువు కొని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని కోరారు. వసతి గృహనికి చెందిన విద్యార్థులు పదవ తరగతిలో మంచి జి పి ఎ సాధించడం అభినందనీయమని అన్నారు. స్వామి మునీ శ్వరా నంద జీ ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా జిల్లా కు చెందిన విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం గొప్ప విషయ మన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఏనలేనిదని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు భారత సేవాశ్రమ సంస్థ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పేద విద్యార్థులకు చేయూత నివ్వడం హర్షణీ యమని అన్నారు.రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారత సేవా శ్రమ సంఘం అందిస్తున్న సేవలు గొప్పవని అన్నారు. డి ఇ ఈ రవీందర్ మాట్లాడుతూ చదువు కుంటేనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్, ఎస్ సి , బి సి కార్పొరేషన్ ల ఇడి లు,యం ఈ ఒ జయశ్రీ ఆయా పాఠశాలల హెచ్ యం లు ,వార్డెన్ లు పాల్గొన్నారు
Admin
Abhi9 News