Saturday, 18 April 2026 06:49:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

భారీ వర్షానికి తెగిన కొల్లాపూర్‌ రోడ్డు

శ్రీరంగాపురం మీదుగా వాహనాల మళ్లింపు

Date : 13 September 2025 12:32 PM Views : 165

Abhi9 News - తెలంగాణ / Hyderabad : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెబ్బేరు నుంచి కొల్లాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారి తెగిపోయింది. శేరిపల్లె సమీపంలో వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నందున పక్కనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటు వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోవడం, అటు తాత్కాలిక రోడ్డు నిర్వహణను పట్టించుకోకపోవడం వల్ల శుక్రవారం నీటి ప్రవాహానికి అది తెగిపోయింది. అదే సమయంలో కొల్లాపూర్‌ నుంచి పెబ్బేరుకు వస్తున్న ఒక భారీ ట్రక్కు దాంట్లో దిగబడిపోయింది. దీంతో జేసీబీ సాయంతో నానా తం టాలు పడి దాన్ని పక్కకు తొలగించారు. రోడ్డు తెగిపోయి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతున్నందున వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెబ్బేరు-కొల్లాపూర్‌ మధ్య ఇది ప్రధాన రహదారి కా వడం, రోజూ వందలాది వాహనాలు తిరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాసీల్దార్‌ మురళి, ఎస్సై యుగంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రోడ్డుకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాలను శ్రీరంగాపురం మీదుగా మళ్లించారు. నిలిచిపోయిన ఈ రోడ్డు వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వంతెన వద్ద రాస్తారోకో చేసి ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పటికీ ఇంత వరకు స్పందన లేదు.

Also Read : భారీ వర్షానికి తెగిన కొల్లాపూర్‌ రోడ్డు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :