Saturday, 18 April 2026 05:11:02 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

యూరియా గోస

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్‌, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ప

Date : 25 September 2025 09:15 AM Views : 178

Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా గోస తీరడం లేదు. బ్యాగుల కోసం రైతులు నిత్యం పీఏసీసీఎస్‌, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడా బ్యాగులు అందక నిరాశ చెందుతున్నారు. దీంతో పలు చోట్ల రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ పీఏసీసీఎస్‌లో అధికారులను ఉంచిన రైతులు బయటి నుంచి తాళం వేశారు. సిబ్బంది టోకెన్లు అందించినా.. యూరియా అయిపోయిందని చె ప్పడంతో కన్నెర్ర చేశారు. స్టాక్‌ లేనప్పుడు టోకెన్లు ఎందుకు ఇచ్చారని అధికారులను నిలదీశారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. స్టాక్‌ లేదని అధికారులు చెబుతున్నారని దుమ్మెత్తిపోశారు. పోలీసులు అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని మన గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద తెల్లవారుజామునే.. ఊర్కొండ రైతు ఆగ్రోస్‌ సెంటర్‌ వద్ద కర్షకులు ఎదురుచూపులు తప్పలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూ సాపేట మండలం జానంపేటలో యూరి యా వచ్చిందని తెలుసుకొన్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముందుగా టోకెన్లు పంపిణీ చేయడంతో అందుకునేందుకు ఎగబడ్డారు. దేవరకద్రలోనూ రైతులు తెల్లవారుజాము నుంచే నిరీక్షించారు. జడ్చర్లలోని ఎరువుల విక్రయ దుకాణాల వద్ద అన్నదాతలు క్యూకట్టారు. హన్వాడలోని పీఏసీసీఎస్‌ వద్ద వేకువజామున 4 గంటలకే రైతుల బారులు కనిపించాయి.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :