Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు మంగళవారం రోజు నారాయణపేట సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో* పోలీసు సిబ్బంది నారాయణపేట బస్టాండ్, మరియు బ్యాంకుల వద్ద ఉన్న ప్రజలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకుల వద్ద కస్టమర్లకు లావాదేవీలు జరిపే సమయంలో అమౌంట్ ఇంటికి తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బస్టాండ్ లో ప్రయాణికులు బస్సులు ఎక్కి దిగే సమయంలో జాగ్రత్తగా ఉంటూ తమ విలువైన బంగారు వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఏమరపాటు ఉండరాదని సూచించారు. బ్యాంకులలో, ఏటీఎంలో ప్రతిరోజు లావాదేవీలు జరపడానికి వచ్చే కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని, అధిక మొత్తం లో డబ్బులు డ్రా చేసే సమయంలో, తీసుకొని వెళ్లే సమయంలో ఏమరపాటుగా ఉండరాదని తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో కొత్త వ్యక్తులకు ఏటీఎం కార్డ్స్ ఇవ్వరాదని, అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మరాదని తెలిపారు. ప్రస్తుత కాలంలో బ్యాంకుల వద్ద దొంగలు అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే వారిపై మాటు వేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుపోయే సమయంలో వెంట ఫాలో అయి మార్గమధ్యలో ఎక్కడైనా ఆపిన ప్రజలందరు చూస్తుండగానే రెప్పపాటు కాలంలోనే దొంగతనాలు చేసి తప్పించుకోని వెళ్లడం జరుగుతుందని కావున బ్యాంకు వచ్చే ప్రజలు కస్టమర్లు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు.
Admin
Abhi9 News