Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట టౌన్ నూతన SHOగా SI.G.విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇతను ఇంతకుముందు నాగర్ కర్నూల్ జిల్లా టౌన్ SHO గా విధులు నిర్వర్తించి బదిలీపై నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. ఇంతకుముందు టౌన్ SHO గా విధులు నిర్వర్తించిన SI సురేష్ గౌడ్ నారాయణపేట SB ఎస్సైగా బదిలీ అయ్యారు. నూతన ఎస్సై G. విజయ్ కుమార్ గారు ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లుకి పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా విధులు నిర్వర్తించాలని పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలందరికీ సమన్యాయం అందిస్తూ, బాధితులు తీసుకొచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రజలకు పోలీస్ వ్యవస్థ పై నమ్మకం, బరోసా కల్పించాలని సూచించారు.
Admin
Abhi9 News