Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహాత్ములు లోక కల్యాణం కోసమే పుడతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవము మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమం బూత్పూర్ రోడ్ లోని వాసవి కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీ, ఉజ్జయిని ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని ప్రజలు పీఠాధిపతులను దర్శించుకొని వారు ఇచ్చే సందేశాలను, వారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రొఫెసర్ ఆర్ చంద్రశేఖర్ రెడ్డి రచించిన HISTOROCAL ANALYSIS OF SRISAILAM AS A SACRED CENTRE అనే పుస్తకాన్ని ఆయన పీఠాధిపతులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పీఠాధిపతుల చేత ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జె పి ఎన్ సి చైర్మన్ కె యస్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News