Thursday, 08 January 2026 02:49:20 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

వెనకబడిన తరగతుల కులాలకు ఇచ్చే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది- డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

Date : 27 July 2023 05:17 PM Views : 316

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పూర్వం నుండి గ్రామాలలో వ్యవసాయం, అనుబంధ కులవృత్తుల ద్వారానే గ్రామాలు ఏర్పడ్డాయని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు,సాంస్కృతిక, పర్యాటక డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని శిల్పారామంలో జిల్లా బి సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజక వర్గంలోని వెనుకబడిన తరగతులలోని పేదలకు ఇచ్చే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వ్యవసాయంతో పాటు, చెరువు, చెరువు కింద వివిధ రకాల వృత్తులు చేసుకునేవారు వారి వారి వృత్తులతో పాటు, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారని, రానురాను సాగునీరులేక, వర్షాలు లేక విద్యుత్తు సరిగా లేక వ్యవసాయాన్ని వదిలి బతుకుదెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేయడం వల్ల రైతులు, రైతు కూలీలు, వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను పునరుద్ధరించడం, ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టి రైతులకు రైతుబంధు,రైతు భీమా వంటి పథకాలను తీసుకు వచ్చిందని అన్నారు . వృత్తుల పైన ఆధారపడి జీవించేవారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు దళిత బంధు, గిరిజనులకు, మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించిన విధంగానే వెనుకబడిన కులాలలోని పేద వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీలకు సైతం ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నదని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీసీల సంక్షేమం లో భాగంగా గతంలో మహబూబ్ నగర్ పట్టణంలో దోబీలకు 60 లక్షల రూపాయలతో వాషింగ్ మిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు తదితరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కమ్యూనిటీ భవనాల వంటివి నిర్మించడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన కులాల ఆర్థిక సహయం పథకం నిరంతరం కొనసాగుతుందని,రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ప్రతినెల 300 మంది లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాలలో ఆర్థిక సహాయం విడతలవారీగా అందరికీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పేదవారికి సంక్షేమ పథకాలను అందించడంలో నిష్పక్షపాతంగా ఉంటామని, ఎవరైనా పేదల నుండి లబ్ధి కోసం డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే తక్షణమే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తామని, పేదల బాగుకోసమే తాము పనిచేస్తామని, గ్రామాల భాగు కోసమే కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ప్రతి గ్రామానికి తండాలలో గ్రామపంచాయతీలు నిర్మించడంతోపాటు, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటిని ,రోడ్లను వేయడం జరిగిందని, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతు బంధుతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ కు సహాయం అందించకుండా మీటర్లు పెడతామని చెప్పినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి బెదురు లేకుండా ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి జిడిపిలో, అభివృద్ధిలో ఎవరు సాటిరాని విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. మహబూబ్నగర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, శిల్పారామం ఒకప్పుడు 30 ఫీట్ల గుంతలు ఉండేవని, అలాంటిది శిల్పారామాన్ని నిర్మించి ఈ ప్రాంతానికి అందాన్ని తీసుకురావడం జరిగిందని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కారణంగా భూముల ధరలు పెరిగిపోయాయని, మహబూబ్ నగర్- జడ్చర్ల నాలుగు లైన్ల రహదారి, బైపాస్ రహదారి తో పాటు, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గత సంవత్సరం వర్షపు నీటికి రామయ్య బౌలి ప్రాంతం నీటిలో మునిగిపోయిందని, అలాంటిది నాళాలు విస్తరించడం, ఈ సంవత్సరం మురికి కాలువలు శుభ్రం చేయటం కారణంగా వర్షం నీరు మినీ ట్యాంక్ బండ్లోకి వెళ్లటం నాలాల గుండా సాఫీగా వెళుతున్నాయని అన్నారు .హాస్టల్ ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, హాస్పిటళ్లలో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని, అధికారులు నిష్పక్షపాతంగా జిల్లాలో పనిచేస్తున్నారని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయలు సద్వినియోగం చేసుకోవాలని, వృధా చేయవద్దని కోరారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి మరో వంద కోట్లు కేటాయించిందని, ఇటీవలే 276 కోట్లు కేటాయించగా ఎస్టీపి,మెయిన్ ట్రంక్ పనులను చేపడుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్నగర్ను మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వస్తే జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ,పెద్ద చెరువును కృష్ణా నది నీటిని నింపుతామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, బీసీలు ఆర్థికంగా సహకారం అందిస్తే వారికి తోడ్పాటుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, లబ్ధిదారులు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేసి ఇంకా ఆర్థికంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ కులవత్తులకు చేయూత ఇవ్వడంలో భాగంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ప్రభుత్వం అందిస్తున్నదని, ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, మొదటి విడతన లబ్ది పొందిన లబ్ధిదారులను స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు సైతం లబ్ధి పొందేలా ఆర్థికంగా పైకి ఎదగాలని ఆయన కోరారు. కాగా బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం జిల్లా వ్యాప్తంగా 15,787 దరఖాస్తులు రాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సుమారు 14000 దరఖాస్తులను అర్హతగా గుర్తించడం జరిగింది. మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 4779 దరఖాస్తులు రాగా ,అందులో 4221 దరఖాస్తులు అర్హత ఉన్నవిగా గుర్తించగా, ఈనెల 300 మంది లబ్ధిదారులకు మొదటి విడుతన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, మున్సిపల్ చైర్మన్ కొరముని నర్సింలు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మహబూబ్నగర్ ఎంపీపీ సుధాశ్రీ ,హన్వాడ ఎంపీపీ బాలరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిర తదితరులు పాల్గొన్నారు అంతకుముందు మంత్రి రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హన్వాడ మండలానికి చెందిన 12 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :