Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పోలీస్ ప్రధాన కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన 15 ప్రజా ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
Admin
Abhi9 News