Saturday, 18 April 2026 05:20:39 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సాయి చంద్ కు అశ్రునివాళి అర్పిస్తూ మీడియా సమావేశంలో ప్రసంగించిన మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్

Date : 29 June 2023 11:13 AM Views : 300

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, కవి, ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.. మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పోషించిన పాత్ర మర్చిపోలేనిదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, మనకు జరిగిన దోపిడిని ప్రజలకు వివరించడంలో సాయి చంద్ కీలక పాత్ర వహించాడన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన గొంతుకతో ఉద్యమ ఆకాంక్షను ప్రజాక్షేత్రానికి తెలియజెప్పిన గొప్ప ఉద్యమకారుడని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి చేరవేయడంలోనూ తన పాట ద్వారా ముఖ్య భూమిక పోషించాడన్నారు. ఎక్కడ ఈ ముఖ్య సమావేశం జరిగినా సాయిచంద్ తన పాటతో ప్రజలందరినీ అలరించేవాడని మంత్రి గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ పాట తెలంగాణ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సాయి చంద్ మృతి పాలమూరుకు, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. సాయి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :