Saturday, 18 April 2026 05:11:02 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పట్టణ మాజీ కౌన్సిలర్ ల విలేకరుల సమావేశం

Date : 12 June 2025 03:50 PM Views : 212

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నగర పాలిక వార్డు ల విభజన శాస్త్రీయంగా లేదని..అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరి చేయాలనీ మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.శాస్త్రీయంగా మహబూబ్ నగర్ నగర పాలిక వార్డు ల విభజన చేయాలనీ కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీ ల నాయకులు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇదే విధంగా వార్డు ల విభజన చేస్తే భవిష్యత్ లో అభివృద్ధి కి ఆటంకం కలుగుతుందని అన్నారు. పెద్ద గ్రామ పంచాయతీ లు.. వార్డు లాపేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేసారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డు ల ఏర్పాటు ఉందని తెలిపారు. అధికారులు సరి చేయకుంటే ప్రజాక్షేత్రం లోకి వెల్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ.. గతంలో వార్డు ల విభజన సమయంలో అందరూ ఒప్పుకున్న తరువాతే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని పక్షాల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలని అధికారులకి చెప్పిన విషయాన్నీ ఆయన గుర్తు చేసారు. ఒకదగ్గర కూర్చొని వార్డు ల విభజన చేయడం కాదని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని, సీనియర్ వార్డు మెంబెర్లతో సమావేశం పెట్టి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఇదే రితిగా అధికారపార్టీ తీరు ఉంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని పేర్కొన్నారు. కొన్ని వార్డు లో ఎక్కువ ఓట్లు ఉన్నాయ్.. కొన్ని వార్డు లో ఎక్కువ ఉన్నాయని అన్నారు. చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపితే ప్రతిపక్షం నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదని తెలిపారు. ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రామ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శరత్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :