Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న దాబాలలో అక్రమ మద్యం సిటింగ్ లు నడిపిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దాబాల యజమానులను అదనపు ఎస్పీ నాగేంద్రుడు హెచ్చరించారు. నారాయణపేట జిల్లా జాతీయ రహదారి 167 పై మరికల్ నుండి కృష్ణ బోర్డర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న దాబాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న దాబాలలో అక్రమ మద్యం సిటింగులు ఏర్పాటు చేసి వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు, రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా పలు దాబాలను తనిఖీ చేసి దాబాల యజమానులు అక్రమ మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని దాబాలను సీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు గ్రామాల నుండి జాతీయ రహదారిని కలిపే రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్, వైట్ పెయింట్ వేయించారా లేదా అని తనిఖీ నిర్వహించి జాతీయ రహదారిని కలిపి రోడ్ల దగ్గర ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు వేయించి వాటికి వైట్ పెయింట్ వేయించి వాహనదారులు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారిపై అవసరం ఉన్నచోట మలుపుల దగ్గర సైన్ బోర్డ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు అయన సూచించారు. జాతీయ రహదారిపై వాహనాల వేగం 80 కిలోమీటర్ల దాటితే వాహనాలకు స్పీడ్ గన్ ద్వారా చాలెన్స్ విధించాలని పోలీసు అధికారులకు తెలిపారు. జాతీయ రహదారిపై వేగ నియంత్రణ కొరకు డ్రమ్స్ తో వేగ నియంత్రణ కొరకు రహదారిపై స్టాపర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదని, రాష్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ విధిగా ధరించాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, టు వీలర్ వాహనాలు త్రిబుల్ రైడింగ్ చేయరాదని, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రహదారిపై సైన్ బోర్డ్స్ గమనిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు.వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలని రోడ్డు నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని అదనపు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ వెంబడి డీఎస్పీ కే.సత్యనారాయణ కృష్ణ ఎస్సై విజయ్ భాస్కర్ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు.
Admin
Abhi9 News