Abhi9 News - తెలంగాణ / రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాతి గుండెలను సైతం కరిగించిన కళాకారుడు సాయిచంద్ అని, వారు చనిపోయారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నం.. చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం అని సాయిచంద్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
Admin
Abhi9 News