Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలంటూ బిజెపి ధర్నా కార్యక్రమము చేపట్టగా బిజెపి జాతీయ ఉపాద్యక్షురాలు డికె అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ పేదలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఖాళీ స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు మోసం చేసిందని అన్నారు. అదేవిధంగా ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి తొమ్మిదిన్నర ఏళ్లయిన నేటికి ఒక్క లబ్దిదారులకు ఇల్లు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం అని ఆమె మండిపడ్డారు.
Admin
Abhi9 News