Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు లతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో 96 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ,వ్యవసాయ శాఖ,పంచాయతీ రాజ్,ఇతర శాఖల కు సంబంధించి దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షా కాలంలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుధ్య చర్యలు తీసుకోవాలని,నీరు నిల్వ లేకుండా చూడాలని,త్రాగు నీటి వనరుల వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు పంచాయతీ రాజ్ శాఖ పంచాయతీ కార్యదర్శులు,ఎం.పి. ఓ లను మండల ప్రత్యేక అధికారులు సమీక్షించాలని అన్నారు. పదిమంది కంటే ఎక్కువ ఉన్న పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను పరిశీలించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ లలో ఉన్న మహిళ సభ్యులలో కొత్తగా వచ్చిన వారి వివరాలు అప్డేట్ చేసి మహిళా,శిశు సంక్షేమ శాఖకు పంపించాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్.సి.,ఎస్.టి.,బి.సి.,మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ ల గురించి కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ లు సమావేశం జరిపి యూనిట్ ల కొనుగోలు సంబంధించి డి.పి.అర్ సమర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్.పి.సి. ఈ. ఓ వెంకట రెడ్డి,డి.అర్.డి. ఓ నర్సింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News