Saturday, 13 June 2026 05:01:55 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

న్యాయానికి నాంది – నిందితులకు శిక్షలు జిల్లా పోలీసుల కృషికి న్యాయవ్యవస్థ ప్రశంస

Date : 11 June 2025 09:14 PM Views : 182

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణలు ముగిసి నిందితులకు శిక్షలు విధించబడినవి. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల నిష్ఠ, నిబద్ధత మరియు న్యాయ వ్యవస్థ యొక్క స్పందన పలువురి ప్రశంసలకు పాత్రమవుతున్నాయి. దేవరకద్ర కేసు – నిందితులకు 4 సంవత్సరాల శిక్ష దేవరకద్ర పోలీస్ స్టేషన్ నందు నమోదు అయిన Cr.No.24/2020 U/s 307 r/w 34 IPC కేసులో నిందితులు: A1: హరిజన్ రవి A2: డొంగుల నరేష్ A3: గుడె గోపాల్ ఈ కేసులో న్యాయమూర్తి శ్రీమతి గుండ్ల రాధిక గారు, అదనపు సహాయ సెషన్స్ కోర్టు, మహబూబ్ నగర్ నందు ఈ రోజు 4 సంవత్సరాల శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.2,000/- చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. సీసీ కుంటా కేసు – నిందితుడికి 3 సంవత్సరాల శిక్ష Cr.No.03/2019 U/s 326 IPC కింద సీసీ కుంటా పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసులో నిందితుడు: కమ్మరి జగతయ్య s/o కృష్ణయ్య చారి, ఈ కేసులో మూడవ అదనపు జూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ మొహమ్మద్ మునావర్ హుస్సేన్ గారు నిందితుడికి 3 సంవత్సరాల శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ ... “నేరం జరిగిన ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు తగిన శిక్ష విధించాలన్నదే జిల్లా పోలీసుల లక్ష్యం. ఈ రెండు కేసుల్లో విచారణాధికారులు, దేవరకద్ర కేసునందు న్యాయం సాధించేందుకు కృషి చేసిన విచారణాధికారి ఎ.వెంకటేశ్వర్లు SIP (f), ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ బి.నాగన్న SIP, పోలీసు సిబ్బంది రఘు PC 2195 మరియు HC బి.నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భక్త్యార్ బాబా మరియు న్యాయ వ్యవస్థ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. CC కుంట కేసులో న్యాయం జరగేందుకు కృషి చేసిన విచారణ అధికారి ఎం.అంజనేయులు SIP (f), సీసీ కుంటా పోలీస్ స్టేషన్, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ ఏ.రాంలాల్ SIP, సీడీఓ వి.శివకుమార్ PC 2413, అలాగే కేసు పక్షాన వాదన నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్.బాబు రావు మరియు రామకృష్ణ గార్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. న్యాయ వ్యవస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది పోలీసు శాఖ యొక్క బాధ్యతను ప్రతిబింబించే విజయం.”

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :