Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కార్పోరేట్, ప్రైవేట్ ఫీజుల నియంత్రణ కోసం ఫీజుల నియంత్రణ చట్టం చేయాలనీ డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో SFI ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు... ఈ సందర్భంగా sfi విద్యార్ధి సంఘం నాయకులూ ప్రశాంత్ మాట్లాడాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అధిక ఫీజుల భారం పడిందని వెంటనే అధిక ఫీజుల భరణి తగించాలని డిమాండ్ చేసారు... ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న అన్ని పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలనీ తక్షణమే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాములను అందించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యాను బలోపేతం చేయాలన్నారు... మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించి నాణ్యమైన భోజనాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్చ కార్మికులను నియమించాలన్నారు
Admin
Abhi9 News