Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నెల 23 న ట్యాంక్ బండ్ పై నిర్వహించదలచిన డ్రోన్ ప్రదర్శనను ఈ నెల 28 కి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా డ్రోన్ లు ఆకాశంలో ఎగర లేవని ,అందువల్ల డ్రోన్ ప్రదర్శనను ఈనెల 28 కి మార్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలు ,ముఖ్యంగా పట్టణ ప్రజలు,చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఈనెల 28 న సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Admin
Abhi9 News