Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : నేరస్తులకు శిక్ష పడేటట్లు చేయడంలో కోర్టు లైసెన్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ యొక్క పాత్ర ముఖ్యం అని జిల్లా ఎస్.పి కె.నరసింహ పేర్కొన్నారు ఈ రోజు శనివారం సీడీపీఓ మరియు కోర్ట్ లైసన్ ఆఫీసర్స్లతో సమీక్షా సమావాశం ఏర్పాటు చేసి....కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు. కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మరియు కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు పాటించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో ( కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్) లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. కోర్టు నందు ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీ.ఎస్.పి వెంకట రమణ రెడ్డి, ఇన్స్పెక్టర్ బషీర్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్, కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Abhi9 News