Saturday, 13 June 2026 05:02:20 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

భూ సమస్యల కొరకే భూభారతి ప్రవేశపెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

Date : 20 June 2025 07:06 PM Views : 188

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : భూ సమస్యల కొరకే భూభారతి ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. భూభారతి రెవెన్యూ సర్వే చివరి రోజు అయిన శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృష్ణ, మాగనూర్, తాసిల్దార్ కార్యాలయలలో, మున్సిపాలిటీ లో నిర్వహిస్తున్న స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందని వాటిలో వచ్చిన అప్లికేషన్లను స్వీకరించి కేటగిరీల వారీగా నోటీసులు అందజేసి ఆర్. డి. ఓ. ఎమ్మార్వో స్థాయిలను ఉంటే పరిష్కరించస్తామని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 3500 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. గత నెల కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామంలో నిర్వహించడం జరిగిందని వచ్చిన అప్లికేషన్స్లను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మాగనూర్ తహసీల్దార్ కార్యాలయం లో వచ్చిన అప్లికిషన్స్ లను పరిశీలించారు. మగనూరు లో ఇప్పటివరకు ఎన్ని అప్లికిషన్స్ వచ్చాయని వాటిలో ఎన్ని పరిష్కరించారని తహసీల్దార్ ద్వారా తెలుసుకున్నారు. మండలం లో 264 అప్లికిషన్స్ వచ్చాయని వాటిలో 234 వరకు ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలో ఉన్నవాటిని పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. పరిష్కరించాబడ్డ వాటిని ఎప్పటికి అప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కృష్ణ మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి లో ఎన్ని ఫీర్యాదులు అందాయి వాటిలో ఎన్ని పరిష్కరింప్పబడ్డాయి వాటి వివరాలను తెలుసుకున్నారు. కృష్ణ మండలం లోని కేజీబీవీ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పాఠశాల లో విద్యార్థుల సంఖ్య ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చారు అని యస్ ఓ ద్వారా తెలుసుకున్నారు. వంట గది ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఫుడ్ కమిటీ తప్పనిసరి గా ఉండాలని ఉపాధ్యాయులలో ఒక్కరు భోజనం సమయం లో భోజనానికంటే ముందు భోజనం చేయాలని తప్పనిసరిగా రిజిస్టర్ మెంటైన్ చేయాలన్నారు. నీటి వృదా కాకుండా కుళాయిలను మరమ్మతు చేయాలన్నారు. విద్యార్థులకు వసతి గృహ లలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టి కి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు..........

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :