Saturday, 18 April 2026 03:30:24 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..!

మున్సిపల్ ఎన్నికలు కొందరి ప్రాణాల మీదకు వచ్చాయి. నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో గుర్తించిన స్థాని

Date : 04 February 2026 07:57 PM Views : 188

Abhi9 News - క్రైమ్ వార్తలు / యాదాద్రి ( భువనగిరి ) : మున్సిపల్ ఎన్నికలు కొందరి ప్రాణాల మీదకు వచ్చాయి. నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డుకు పస్తం మల్లమ్మ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమా మహేశ్వరి నామినేషన్ వేశారు. పస్తం మల్లమ్మ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమా మహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం వద్దు మా వార్డుకు ఎన్నికలు జరపాలంటూ మున్సిపాలిటీ ఎదుట ఆందోళన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించకపోతే ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమామహేశ్వరుని సీట్లో కూర్చొనియమని, తమ వార్డుకు ఎమ్మెల్యే రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు విత్ డ్రా చేసుకున్న మల్లమ్మపై వార్డులోని ఓటర్లు ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుని నామినేషన్ ను విత్ డ్రా చేకుందని మల్లమ్మపై వార్డు ప్రజలు మండిపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన మల్లమ్మ తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు డోర్ పగలగొట్టి ఆమెను రక్షించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు డబ్బులు తీసుకో లేదని చెబుతున్నా.. తనను మానసికంగా హింసిస్తున్నారని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు ఓ అభ్యర్థి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :