Monday, 05 January 2026 04:30:56 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్!

మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (GLA) చీఫ్‌గా ఉన్న బరిసె దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగి

Date : 02 January 2026 05:34 PM Views : 42

Abhi9 News - క్రైమ్ వార్తలు / : హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూసే కీలక నేతగా బరిసె దేవా కొనసాగుతున్నారు. హిడ్మా, బరిసె దేవా ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారిగా సమాచారం. సుదీర్ఘకాలంగా అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మావోయిస్టు మిలిటరీ వ్యూహాలు, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో బరిసె దేవా అత్యంత కీలక లింక్‌గా వ్యవహరించారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా అత్యాధునిక ఆయుధాల నిర్వహణ, సరఫరా బాధ్యతలు ఆయన వద్దనే ఉండేవని సమాచారం. ఈ క్రమంలో దేవా వద్ద అత్యంత శక్తివంతమైన మౌంటెయిన్ (లైట్ మెషిన్ గన్) వెపన్లు ఉన్నట్లు వర్గాలు తెలుసుకున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. బరిసె దేవా వద్ద మొత్తం 12 మౌంటెయిన్ వెపన్లు ఉన్నట్లు తేలింది. ఒక్కో వెపన్‌కు హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉండటం గమనార్హం. ఈ ఆయుధాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇది మావోయిస్టు సాయుధ బలగాలకు భారీ నష్టం అని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరిసె దేవాతో పాటు మరికొందరు అత్యంత కీలక మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మిలిటరీ నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతింటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న మావోయిస్టు కార్యకలాపాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుంది. బరిసె దేవా లొంగుబాటును కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లొంగుబాటు, పునరావాస విధానాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. మావోయిస్టులు హింసను వీడి ప్రజాస్వామ్య మార్గంలోకి రావాలని కేంద్ర హోంశాఖ మరోసారి పిలుపునిచ్చింది. శనివారం లొంగుబాటు అనంతరం బరిసె దేవా మీడియా ముందుకు రానున్నట్లు సమాచారం. తన లొంగుబాటు వెనుక కారణాలు, మావోయిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుపై కీలక మలుపుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :