Abhi9 News - క్రైమ్ వార్తలు / : బస్టాండ్ వేచి ఉన్న ప్రయాణికుల మీదకు బస్సు దూసుకెళ్లి నలుగురు మరణించిన ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. జనాలు తమ పనులు ముగించుకొని ఇంటికెళ్లేందుకు బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వరకు గాయపడగా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఈ సంఘటన సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఉదయం పనులకు వెళ్లిన జనాలు తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌టో నిలబడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి బస్టాండ్‌లోని జనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Abhi9 News