Saturday, 18 April 2026 05:13:28 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు

కొత్తగా పెళ్లైన ఓ జంట కేవలం 2 నెలల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో పోలీసులకు నిద్రలేకుండా చేశారు. హనీమూనిక వెళ్లిన ఈ జంట గొడవలతో తిరిగి సొంతూరు వచ్చారు.

Date : 29 December 2025 02:18 PM Views : 219

Abhi9 News - క్రైమ్ వార్తలు / : బెంగళూరులో కొత్త పెళ్లైన జంట వేర్వేరే చోట్ల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసింది. హనీమూన్ ట్రిప్ సందర్భంగా భర్తతో గొడవపడి నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూశాయి. గురువారం (డిసెంబర్‌ 25) వధువు ఆత్మహత్య తర్వాత ఆమె భర్త కూడా ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్నాడు. నాగ్‌పూర్‌లో అతని తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో రెండు నెలల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిగా ఉన్న సూరజ్‌ అనే వ్యక్తితో గణవి (26) అనే యువతితో వివాహం జరిగింది. అక్టోబర్ 29న గ్రాండ్ వివాహ రిసెప్షన్ కూడా జరిగింది. ఇందుకు వధువు తల్లిదండ్రులు దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఈ జంట 10 రోజుల క్రితం హనీమూన్‌కి శ్రీలంకకు వెళ్లారు. ఐతే అక్కడ ఈ జంట గొడవ పడటంతో ఐదు రోజుల్లోనే బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఏం జరిగింతో తెలియదుగానీ నవ వధువు బుధవారం మధ్యాహ్నం అత్తింట్లో ఉరి వేసుకుని సూసైడ్‌ చేసుకుంది. గణవి సూసైడ్‌ తర్వాత ఆమె తల్లిదండ్రులు, బంధువులు అత్తింటి వారిపై వరకట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాల కింద కేసు పెట్టారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె భర్త కుటుంబం వేధింపుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేసు నమోదైన తర్వాత మృతురాలి భర్త, అతని తల్లి జయంతి, సోదరుడితో కలిసి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు పారిపోయాడు. భార్య మరణించిన 2 రోజుల తర్వాత భర్త సూరజ్ శివన్న (36) శుక్రవారం నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శివన్న సూసైడ్‌ చేసుకున్న విషయాన్ని అతడి సోదరుడు సంజయ్ శివన్న నాగ్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో శివన్న తల్లి బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్తితి విషమంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :