Monday, 05 January 2026 04:31:24 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు..

జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో వార్డెన్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో

Date : 31 December 2025 09:06 AM Views : 42

Abhi9 News - క్రైమ్ వార్తలు / జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో వార్డెన్ దారుణంగా డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన సంఘటన తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎస్సీ బాలికల హాస్టల్‌ విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్‌ భవానీపై వేటుపడింది. విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వార్డెన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (DWO)ని ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. భూపాలపల్లి జిల్లా లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ చితక బాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో హాస్టల్ వార్డెన్ భవాని కర్రతో విచక్షణారహితంగా విద్యార్థినిపై దాడిచేయడం కనిపిస్తుంది. విద్యార్థినిని చితకబాదుతుండగా అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ ఘటన గత నెల 24న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్ష రాసేందుకు ఎగ్జిట్‌ అయి చెప్పి పోయినావ్‌ కదా.. హాస్టల్‌లో ఎగ్జిట్‌ పన్నెండింటికి అయిపోతదని తెల్వదా? ఎగ్జిట్‌ అయిపోయే టైం హాస్టల్‌ ఉండాలన్న సోయిలేదా నీకు అంటూ వార్డెన్‌ ఓ వైపు తిడుతూనే.. మరోవైపు కర్రలు, చేతులతో విద్యార్థినిని చితకబాదింది. కాగా రెండు నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ వార్డెన్‌ వార్తల్లో నిలిచింది. వరుస ఘటనలతో హాస్టల్ లో ఏం జరుగుతుందోనని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు బైఠాయించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. వార్డెన్ తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :