Abhi9 News - క్రైమ్ వార్తలు / విశాఖపట్నం : విశాఖపట్నం- దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఆదివారం (డిసెంబర్ 28) అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రాత్రి 1.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలులోని ప్యాంట్రీ కారుకి పక్కపక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనలతో రైలు దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే 2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్టేషన్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాలు భీతావహకంగా కనిపించాయి. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చిన ఈ ట్రైన్.. అక్కడి నుంచి బయలుదేరి నర్సింగబల్లి మీదగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బీ1 బోగీలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడిని విశాఖకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రయాణికులు సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. దాదాపు రెండు 2 మంది ప్రయాణికుల ఆహాకారలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లన్నీ రద్దు చేశారు. అర్ధరాత్రి 3.30 గంటల తర్వాత మరొక రైలులో ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Admin
Abhi9 News