Monday, 05 January 2026 04:32:41 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..!

ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్ల

Date : 02 January 2026 01:37 PM Views : 35

Abhi9 News - క్రైమ్ వార్తలు / జగిత్యాల : ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది. ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్రాణాలపైకే తెస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల పట్టణంలో గోవిందులపల్లెకు చెందిన కొలగాని అంజయ్య చిట్టి వ్యాపారం నడిపేవాడు. అంజయ్య దగ్గర భాషాజీ శ్రీను చిట్టి కడుతున్నాడు. మధ్యలో ఏవో అవసరాలతో అంజయ్యను కాస్త ఒత్తిడి చేసి మధ్యలోనే చిట్టి ఎత్తుకున్నారు. అయితే ఎత్తుకున్న చిట్టి డబ్బులు చెల్లించడం విషయం వివాదం రాజుకుంది. చిట్టి ప్రారంభించి, పూర్తయ్యేవరకూ కూడా ఆ చిట్టీలో భాగస్వాములైనవారు ప్రతీ నెలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా శ్రీను, అంజయ్యకు 12 వేల రూపాయలు ఇంకా కట్టాల్సి ఉంది. ఆ డబ్బులు కట్టాలని అంజయ్య కాస్త ఒత్తిడి తీసుకొచ్చాడు. తిరిగి కట్టాలని అడిగినందుకు, అంజయ్యను.. భాషాజీ శ్రీను, తన కొడుకు వేణుతో కలిసి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అంజయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గోవిందుపల్లెకు చెందిన మృతుడు 58 ఏళ్ల కొలగాని అంజయ్యకు గణేష్ నగర్ కు చెందిన శ్రీనివాస్ కూ మధ్య ఒక లక్ష రూపాయల వ్యవహారంలో తేడాలు వచ్చాయి. ఆ తేడా కాస్తా గొడవగా ముదిరింది. దాంతో అంజయ్య.. శ్రీనివాస్ పై మరింత ఒత్తిడి పెట్టడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే గురువారం (జనవరి 01) ఏకంగా ఇంటికెళ్లి తిట్టడంతో.. తండ్రి శ్రీనివాస్ తో కలిసి, కొడుకు వేణు.. అంజయ్యతో గొడవకు దిగారు. దాంతో గొడవ ముదిరింది. కట్టెలు, పిడిగుద్దులతో కొట్టేసరికి కొలగాని అంజయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అంజయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అంజయ్య ఆసుపత్రిలో మృతి చెందాడు. జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై ఈ గొడవ జరగ్గా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :